Crush Meaning In Telugu – క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు
krəSH
నలిపివేయు
Nalipivēyu
Crush (క్రష్) అనగానే ఇది లవ్ మ్యాటర్ కు సంబంధించిన పదం అని అందరికీ తెలుసు. క్రష్ అనే పదాన్ని రెండు రకాలుగా వాడుతారు. ఒకటి సాధారణ క్రియ (general verb) కాగా మరొకటి ప్రేమ (love) విషయంలో వాడుతారు. క్రష్ పదానికి సంబంధించిన అర్థాలు, ఉదాహరణలతో సహా ఈ Crush Meaning In Telugu Post లో తెలుసుకుందాం.
Crush (General Verb) Meaning In Telugu Words And Telugu Language
ప్రేమ విషయం లో కాకుండా మామూలు సందర్భాల్లో క్రష్ పదం యొక్క అర్థం తెలుగులో తెలుసుకుందాం.
CRUSH = నలిపివేయుట, పగులగొట్టుట, అణచివేయుట, చితకొట్టుట
- CRUSH పదానికి సంబంధించిన పూర్తి tenses list ఇక్కడ క్లిక్ చేసి చూడండి.
- Crush – I, you, we, they పక్కన వాడాలి.
- Crushes – He, she, it పక్కన వాడాలి.
Crush the bottle after use meaning in Telugu- సీసాని వాడిన తరువాత నలిపివేయండి.
Crushed Meaning – క్రష్డ్ మీనింగ్ ఇన్ తెలుగు

CRUSHED Meaning In Telugu | నలిపివేశారు, నలిపివేశాడు, నలిపివేసింది పగులగొట్టారు, పగులగొట్టాడు, పగులగొట్టింది అణచి వేశారు, అణచి వేసాడు, అణచి వేసింది చితగొట్టారు, చితగొట్టాడు, చితగొట్టింది |
Crush Meaning In Love – క్రష్ మీనింగ్ ఇన్ లవ్
అవతలి వ్యక్తి గురించి పూర్తిగా తెలియకుండానే, వారి సాన్నిహిత్యాన్ని కోరుకోవడాన్ని క్రష్ అంటారు. క్రష్ అనేది వయస్సును బట్టి, ఆలోచనా సరళిని బట్టి అభివర్ణించాల్సి ఉంటుంది. క్రష్ కి తెలుగులో ప్రత్యేకంగా ఏ పదము లేదు. క్రష్ అంటే మోజు, వ్యామోహం, ఇష్టం, ప్రేమ అనే అర్థాలు వస్తాయి.
First Crush Meaning – ఫస్ట్ క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు
ఫస్ట్ క్రష్ (First Crush) అంటే తమ జీవితంలో మొట్టమొదటి సారి ఒక వ్యక్తిని ఇష్టపడడం లేదా మోజు పడటం. ప్రతి మనిషి జీవితంలో ఫస్ట్ క్రష్ కి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. ఫస్ట్ క్రష్ ని ఎవ్వరు అంత త్వరగా మర్చిపోరు.
Crush Examples With Meaning In Telugu – క్రష్ కి సంబంధించిన ఉదాహరణలు
ఇక్కడ క్రష్ పదానికి సంబంధించిన ఉదాహరణలు ఇవ్వడం జరిగింది. ఇవి దాదాపు ప్రేమ కు క్రష్ ఉదాహరణలు.
(1) Secret Crush Meaning In Telugu – సీక్రెట్ క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు
సీక్రెట్ క్రష్ (Secret Crush) అంటే ఒక వ్యక్తిని ఎవరికి తెలియకుండా రహస్యంగా మోజు పడటం లేదా కామించడం. సాధారణంగా ఎవరిమీదైనా క్రష్ ఉంటే ఆ విషయాన్ని స్నేహితులతో పంచుకుంటారు. కాని కొన్ని సందర్భాల్లో ఈ విషయాన్ని రహస్యంగా ఉంచకపోతే పెద్ద గొడవలకు దారి తీస్తుంది. Secret Crush ను ఈ క్రింది సందర్భాల్లో ఎక్కువగా మెయింటైన్ చేస్తుంటారు.
- ఇద్దరి వయసు లో వ్యత్యాసం ఉన్నప్పుడు: When he was studing in engineering college, he had a secret crush on the landlord aunty – అతను ఇంజినీరింగ్ కళాశాలలో చదువుతున్నప్పుడు, (ఇంటి) ఓనర్ ఆంటీ పైన రహస్యంగా వ్యామోహం పెంచుకున్నాడు..
- ఆమోదయోగ్యం కాని సహచర్యం కోరుకున్నప్పుడు: Nani had a secret crush on his science teacher – సైన్స్ టీచర్ పైన నానికి వ్యామోహం ఉన్నింది.
- వరుస కుదరని బంధువు పైన వ్యామోహం పెంచుకున్నప్పుడు
(2) You Are My Crush Meaning In Telugu – యూ ఆర్ మై క్రష్ మీనింగ్ ఇన్ తెలుగు
అమ్మాయిల విషయంలో You are my crush అంటే తెలుగులో నువ్వే నా ప్రియురాలివి, నువ్వే నా ఇష్టసఖి, నువ్వే నా కామదేవత అనే అర్థాలు వస్తాయి. అదే అబ్బాయిలు విషయంలో అయితే నువ్వే నా ప్రియుడివి, నువ్వే నా ఇష్టసఖుడివి, నువ్వే నా మన్మధుడివి అని అర్థాలు వస్తాయి.